- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాయ్‌కాట్ బిగ్ బాస్ .. శ్రీజ దమ్ము ఎలిమినేషన్.. నాగార్జున తీసుకున్న నిర్ణయం..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోతుంది. ఫైర్ స్టార్మ్ అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో షో మరింత హైప్ అవుతుందని అనుకున్నారు. కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ కాస్త తలకిందులు చేసింది. ఫ్లోరా శైనీ ఎలిమినేషన్ ఓకే కానీ శ్రీజ దమ్మును ఎలిమినేట్ చేయడాన్ని

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోతుంది. ఫైర్ స్టార్మ్ అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో షో మరింత హైప్ అవుతుందని అనుకున్నారు. కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ కాస్త తలకిందులు చేసింది. ఫ్లోరా శైనీ ఎలిమినేషన్ ఓకే కానీ శ్రీజ దమ్మును ఎలిమినేట్ చేయడాన్ని రియాలిటీ షో అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. ఆడియన్స్ ఓట్లతో పనేముందని.. బిగ్ బాస్‌ను తిట్టిపోస్తున్నారు. ఇదంతా బయాస్డ్‌గా జరుగుతుందని హోస్ట్ నాగార్జునను కూడా వేసుకుంటున్నారు.
అసలు ఎలిమినేషన్ విషయంలో పవర్ ఆడియన్స్‌కు ఉండాలి కానీ అప్పుడే ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్స్‌కు ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. వెంటనే శ్రీజ దమ్మును హౌజ్‌లోకి తీసుకోవాలని.. లేదంటే బిగ్ బాస్‌ను బాయ్‌కాట్ చేస్తామని పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్‌పై తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతుండగా.. శ్రీజ రీఎంట్రీ ఇస్తుందా లేదా? చూడాలి మరి.






