‘అఖండ 2’.. ఎందుకు అందరూ చూడాలి? డైరెక్టర్ కామెంట్స్

by Sujitha Rachapalli |

‘అఖండ 2’ అఖండ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపాడు బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను. సినిమా గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో

‘అఖండ 2’.. ఎందుకు అందరూ చూడాలి? డైరెక్టర్ కామెంట్స్
X

దిశ, సినిమా : ‘అఖండ 2’ అఖండ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపాడు బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను. సినిమా గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిందని ఆనందం వ్యక్తం చేశాడు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోందని.. ఈ అఖండ విజయాన్ని ఎంత ఫీలైనా తక్కువేనని తెలిపాడు. ఈ సినిమా డబ్బు కోసం తీసింది కాదని.. ప్రజలకు చేరాలని తీశామన్నాడు. మన తత్వం ఏమిటి? ప్రపంచంలో ఎవరైనా మనల్ని చూసి చేతులెత్తి ఎందుకు దండం పెడతారు? మనం ఆచరించే ధర్మం కోసం మాత్రమే అన్నాడు. ‘మనం బిడ్డ పుట్టగానే పేగు తెంచి దేవుడికి ముడి వేస్తాం. దేవుడు పేరు పెట్టుకుంటాం. ఎదుగుతుంటే దేవుడు దయ అంటారు. చివరికి లోకాన్ని విడిచినప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాడు అంటాం. మనకి కష్టం వచ్చినా దేవుడే.. ఆనందం వచ్చినా దేవుడే.. అలాంటి అంశాలతో ఒక గొప్ప దారిని ఎంచుకుని తీసిన సినిమా ఇది. ప్రతి ఒక్కరికి చేరాల్సిన సినిమా ఇది. తప్పకుండా అందరికీ రీచ్ అవుతుంది’ అని తెలిపాడు. అంతేకాదు ఈ సినిమా చాలా పవర్ ఫుల్‌గా కమర్షియల్ అంశాలతో తీయడం జరిగిందన.. ఆడియన్స్ ఊపిరి బిగబట్టుకొని చూస్తున్నారని.. అలాంటి అనుభూతితో తీసిన సినిమా ఇది అని తెలిపాడు డైరెక్టర్.

Next Story