Boyapati Sreenu: కేవ‌లం 9 నిమిషాలే.. పాకిస్తాన్ ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు !

by velandi.Saikiran |

పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపించిందన్నారు. కేవలం 9 నిమిషాల్లో టార్గెట్ చేసి, మూడంటే మూడు రోజుల్లోనే పాకిస్తాన్

Boyapati Sreenu: కేవ‌లం 9 నిమిషాలే.. పాకిస్తాన్ ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలయ్య హీరోగా చేసిన అఖండ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఇండియన్ ఆర్మీ గురించి ప్రస్తావిస్తూ స్పీచ్ అదరగొట్టారు బోయపాటి శ్రీను. యుద్ధం అనేది సృష్టించిందే మన ఇండియా అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పైన ఇండియా పై చేయి సాధించడానికి ముఖ్య కారణం యోధుడు లాంటి ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ప్ర‌శంసించారు. అలాగే మొన్న ఇండియా, పాకిస్తాన్ యుద్ధ పరిణామాలను కూడా గుర్తు చేశారు. పహల్గాం సంఘటనలో మన ఆడబిడ్డల సింధూరం చెరిపితే , ఆపరేషన్ సిందూర్

పేరుతో పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపించిందన్నారు. కేవలం 9 నిమిషాల్లో టార్గెట్ చేసి, మూడంటే మూడు రోజుల్లోనే పాకిస్తాన్ ఉగ్రవాదులను మోకాళ్ళ మీద కూర్చోబెట్టారని గుర్తు చేశారు. పాకిస్తాన్ దేశానికి కూడా చుక్కలు చూపించింది మన ఇండియా అంటూ ప్రశంసించారు. అది మన ఇండియన్ ఆర్మీ పవర్ అని వ్యాఖ్యానించారు. ఇండియన్ ఆర్మీ పైన పూర్తి స్థాయిలో నమ్మకం ఉంచి, పాకిస్తాన్ మెడలు వచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ అంటూ బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అటు అఖండ 2 సినిమా గురించి మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ చేసుకోవడానికి సహకరించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాలయ్య గారు తన ఆస్తి, పవర్, మా ధైర్యం అంటూ పేర్కొన్నారు. ఈ సినిమా ఎవరు ఊహించని రీతిలో అందరినీ ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. కుల మత బేధాలు లేకుండా ఈ సినిమా చూడాలని కోరారు. కాగా అఖండ 2 సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా చేయగా, సంయుక్త మీనన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా బాలయ్య నటించిన ఈ అఖండ 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు.

Next Story