- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాక్సాఫీస్ వద్ద అల్లకల్లోలం... వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన యానిమేటెడ్ సినిమా..
అశ్విన్ కుమార్(Ashwin Kumar) తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’(Mahavatar Narasimha) గురించే ప్రెజెంట్ అంతా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అశ్విన్ కుమార్(Ashwin Kumar) తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’(Mahavatar Narasimha) గురించే ప్రెజెంట్ అంతా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పౌరాణిక యానిమేటెడ్ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. పూర్తి స్థాయిలో యానిమేషన్‌తో రూపొందిన ఈ సినిమా థియేటర్లలోకి ఎలాంటి హైప్ లేకుండానే సైలెంట్‌గా అడుగుపెట్టినా, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
అంతేకాకుండా కలెక్షన్ల విషయంలోనూ కోట్లు కొల్ల కొడుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. కేవలం పది రోజుల్లోనే రూ.105 కోట్లు కొల్లగొట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయిన ఒక యానిమేటెడ్ సినిమా ఇంతటి కలెక్షన్లు రాబట్టడం విశేషం అనే చెప్పాలి.






