- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన "బొమ్మ హిట్"
by Sujitha Rachapalli |
చైల్డ్ ఆర్టిస్టుగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "బొమ్మ హిట్". ఈ చిత్రాన్ని అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1గా గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్నారు.

X
దిశ, సినిమా : చైల్డ్ ఆర్టిస్టుగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "బొమ్మ హిట్". అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1గా గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తుండగా.. బొమ్మ హిట్ చిత్రంతో రాజేష్ గడ్డం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజా యడం హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో.. ‘ఇది హీరోగా నాకు రెండో సినిమా. ఫస్ట్ ఫిలిం వర్క్స్ జరుగుతున్నాయి. బొమ్మ హిట్ సినిమా మంచి ఎంటర్టైన్‌మెంట్‌తో సిచ్యువేషనల్ కామెడీతో వినోదాన్ని ఇస్తుంది. ఈ చిత్రంలో ఫన్‌తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంది. మా బొమ్మ హిట్ సినిమాను ఆడియన్స్ హిట్ చేస్తారని కోరుకుంటున్నా’ అని తెలిపాడు.
Next Story






