- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బొమన్ ఇరానీ
బొమన్ ఇరానీ మాట్లాడుతూ.. పెద్ది చాలా మంచి సినిమా. రామ్ చరణ్ గారు అద్భుతమైన నటుడని చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇటీవల మే 18న విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ట్రైలర్‌లో హీరో పాత్రకు ఎలివేషన్ ఇచ్చే కీలక పాత్రలో బొమన్ ఇరానీ కనిపించడం విశేషం. దీంతో ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండబోతుందని స్పష్టంగా అర్థమవుతోంది. తాజాగా బొమన్ ఇరానీ ‘పెద్ది’ సినిమా అలాగే రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. “పెద్ది చాలా మంచి సినిమా. రామ్ చరణ్ గారు అద్భుతమైన నటుడు. చాలామంది ఈ చిత్రాన్ని కేవలం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీగా భావిస్తున్నారు. కానీ ఇందులో ప్రేక్షకులను అలరించే అద్భుతమైన స్పోర్ట్స్ సన్నివేశాలతో పాటు బలమైన దేశభక్తి అంశాలు కూడా ఉంటాయి. ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బొమన్ ఇరానీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు.






