Hrithik Roshan: హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో బాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా మూవీ.. అంచనాలను పెంచేస్తున్న మేకర్స్ ట్వీట్..

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-01 06:15:57  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ‘వార్-2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Hrithik Roshan: హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో బాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా మూవీ.. అంచనాలను పెంచేస్తున్న మేకర్స్ ట్వీట్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ‘వార్-2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ వార్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. భారీ అంచనాల మధ్య ‘వార్-2’ ఆగస్టు 14న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ విడుదల కాబోతుంది. ఇక ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన గ్లింప్స్ ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, హృతిక్ రోషన్ ఓ బడా నిర్మాణ సంస్థలో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది.

భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించిన ఈ సంస్థ ఇప్పుడు హృతిక్ రోషన్‌తో ఓ ప్రాజెక్ట్ చేయనుండటం విశేషం. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘గ్రీకు దేవుడిగా పిలుస్తాము. పరిమితులకు బద్దలు కొట్టేస్తాడు. హృతిక్ రోషన్‌ను హోంబలే కుటుంబానికి స్వాగతించడానికి మేము గర్విస్తున్నాము. సంవత్సరాలుగా నిర్మాణంలో ఉంది. గంభీరత, గొప్పతనం కథను చూపించబోతున్నాం. ఊహలకు మించి ఉంటుంది. బిగ్ బ్యాంగ్ మొదలు కాబోతుంది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎలాంటి జానర్‌లో సినిమా రాబోతుందో అని ప్రేక్షకుల్లో క్యూరాయాసిటీ పెరిగిపోయింది. అలాగే ఈ పోస్ట్ అంచనాలను పెంచుతోంది.

Next Story