Viral video: పల్లెటూరులో బాలీవుడ్ క్వీన్స్..పేడ ఎత్తుతూ కత్రీనా, నీళ్లు మోస్తూ ప్రియాంక

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-23 12:43:53  IST  )

ప్ర‌స్తుతం ఏఐ వినియోగం ఏ స్థాయిలో పెరిగిపోయిందో తెలిసిందే. ఏఐ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. మరోవైపు ఏఐపై పట్టు ఉన్నవారు ఉద్యోగాలు సాధిస్తున్నారు.

Viral video: పల్లెటూరులో బాలీవుడ్ క్వీన్స్..పేడ ఎత్తుతూ కత్రీనా, నీళ్లు మోస్తూ ప్రియాంక
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌స్తుతం ఏఐ వినియోగం ఏ స్థాయిలో పెరిగిపోయిందో తెలిసిందే. ఏఐ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. మరోవైపు ఏఐపై పట్టు ఉన్నవారు ఉద్యోగాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం ఏఐ ద్వారా కంటెంట్ రైటింగ్, కోడింగ్‌తో పాటు వీడియో ఎడిటింగ్ ఫోటో ఎడిటింగ్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కంటెంట్ రైటింగ్, కోడింగ్‌తో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్‌తో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఏఐతో ఫేక్ ఫోటోలు వీడియోలు క్రియేట్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలా తయారు చేసిన ఫేక్ వీడియోల్లో అసభ్య వీడియోలతో పాటు కొన్ని ఫన్నీ ఏఐ వీడియోలు సైతం ఉంటున్నాయి.

అలాంటి ఫన్నీ వీడియోనే తాజాగా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాలీవుడ్ హీరోయిన్లు గనక పల్లెటూరులో ఉండి ఉంటే ఎలా ఉండేది అనేదాన్ని చూపించారు. కొంతమంది బాలీవుడ్ హీరోయిన్లు వీడియోలో కనిపిస్తున్నారు. వీడియోలో కరీనా కపూర్ మంచంపై కూర్చుని టీ తాగుతూ పేపర్ చదువుతూ కనిపిస్తోంది. హీరోయిన్ కత్రీనా కైఫ్ పేడ ఎత్తుతూ, ప్రియాంక చోప్రా నీళ్లు మోస్తూ కనిపిస్తున్నారు. ఇక ఆలియా భట్ చపాతీలు వడ్డిస్తూ, దీపికా పదుకునే పెరుగు చిలుకుతూ కనిపిస్తున్నారు. నిజజీవితంలో సన్నగా నాజూగ్గా కనిపించే ముద్దుగుమ్మలు ఏఐ వీడియో బొద్దుగా కనిపిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమ స్టైల్‌లో కామెంట్లు పెడుతున్నారు.

Click For Tweet..

Next Story