kajol:‘డిగ్నిటీ సూట్స్ బటన్ క్లిక్ చేసే వరకు మాత్రమే ఉంటాయి’.. ఒక్క పోస్ట్‌తో నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదుగా?

by Kodari Anjali |

బాలీవుడ్ బ్యూటీ కాజోల్ (kajol) అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల మనసులో ఓ స్థానం సంపాదించుకుంది.

kajol:‘డిగ్నిటీ సూట్స్ బటన్ క్లిక్ చేసే వరకు మాత్రమే ఉంటాయి’.. ఒక్క పోస్ట్‌తో నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదుగా?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ కాజోల్ (kajol) అనేక చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల మనసులో ఓ స్థానం సంపాదించుకుంది. ఈ అమ్మడు చివరగా దో పత్తి చిత్రంలో నటించింది. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో కాజోల్‌తో పాటుగా కీలక పాత్రలో మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ (Kriti Sanon)కూడా నటించింది. అద్భుతమైన ప్రదర్శన కనబర్చి మొట్టమొదటిసారిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోన్న కృతి సనన్ మంచి సక్సెస్ అందుకున్న చిత్రం అంటే ఇదేనని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేశారు. కాజోల్ ముఖ్య పాత్రలో నటించిన దో పత్తి సినిమా తర్వాత ఎక్కువ అవకాశాలు అందుకోన్నట్లు తెలుస్తోంది. దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ నటి దోపత్తి మూవీతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.

ఇక ఇటీవలే కాజోల్ తన కుమార్తె సినీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. కూతురు నైసా దేవగన్‌(Nysa Devgan)కు సినిమాల్లో చేరే ఆసక్తి లేదని వెల్లడించింది. ప్రస్తుతం స్టడీపై ఫోకస్ చేసిందని సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు చెక్ పెట్టింది. ఇకపోతే తాజాగా కాజోల్ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. బ్లాక్ శారీలో స్టన్నింగ్ స్టిల్స్ పంచుకుని.. ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది.. ‘డిగ్నిటీ సూట్స్ బటన్ క్లిక్ చేసే వరకు మాత్రమే ఉంటాయి.

ఆపై నేను తిరిగి వస్తాను’ అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు వరుస కామెంట్లతో ముంచెత్తుతున్నారు. లుకింగ్ గార్జియస్ అంటూ ఒకరు అనగా.. బ్లాక్ శారీలో స్టన్నింగ్ లుక్ మేడమ్, సో బ్యూటీఫుల్, మళ్లీ వరుస సినిమాలతో మమ్మల్ని అలరించండి’ అంటూ మరికొందరూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాజోల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story