- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబైలో పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ఈవెంట్.. ముఖ్య అతిథిగా బాలీవుడ్ హీరో!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) కెరియర్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా హరిహర వీరమల్లు రాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) కెరియర్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా హరిహర వీరమల్లు రాబోతోంది. జూన్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాత ఏఎమ్ రత్నం ప్రకటించారు. అయితే.. సినిమా ప్రమోషన్స్‌ను చిత్రబృందం భారీ స్థాయిలో చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తుండటంతో నార్త్‌లో భారీ ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నారట. ముంబై వేదికగా ప్రీరిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి.. పవన్ కల్యాణ్‌తో పాటు మరో స్టార్ హీరో(Bollywood)ను గెస్ట్‌గా తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్‌కు, చిరంజీవికి సల్మాన్ ఖాన్‌తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ నేపథ్యంలోనే చరణ్ ద్వారా సల్మాన్‌ను ఈవెంట్‌కు గెస్ట్‌గా పిలిచే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదే నిజమైతే అటు హిందీలో, ఇటు తెలుగులో వీరమల్లుకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఖాయమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ ఇద్దరూ ఈ చిత్రానికి దర్శకులుగా వ్యవహరించారు. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా చేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ఫొటోలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు గ్యాస్ వచ్చిన పవన్ కల్యాణ్.. రీఎంట్రీ ఇచ్చాక వరుస రీమేక్స్ చేశారు. వకీల్ సాబ్, బీమ్లా నాయక్, బ్రో వంటి రీమేక్స్ సినిమాలు చేశారు. ఈ మూడు సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత పవన్ కల్యాణ్ నుంచి డైరెక్ట్ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచస్తున్నారు.
నార్త్ లో చాలా పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు🔥🔥🔥 పవన్ కళ్యాణ్ తో పాటు ముఖ్య అతిథిగా మరొక మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి వచ్చేలా ప్లానింగ్💥👍🏻 #HariHaraVeeraMallu #HHVM pic.twitter.com/x6IYObr13d
— Narendra News (@Narendra4News) May 20, 2025






