పాన్ ఇండియా స్టార్‌తో మరోసారి రొమాన్స్ చేయబోతున్న బాలీవుడ్ బ్యూటీ.. ఆనందంలో ఫ్యాన్స్?

by Kodari Anjali |

బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ (Disha Patani) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

పాన్ ఇండియా స్టార్‌తో మరోసారి రొమాన్స్ చేయబోతున్న బాలీవుడ్ బ్యూటీ.. ఆనందంలో ఫ్యాన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ (Disha Patani) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌ను రెండు కవర్ చేస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఏ సినిమా అవకాశం వచ్చినా వదులుకోకుండా.. తన అద్భుతమైన నటనా ప్రదర్శన చూపిస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు తెలుగులో (Pan India Star Prabhas) సరసన కల్కి 2898 ఏడీలో అద్భుతంగా నటించి.. తన ప్రతిభను చాటింది.

తాజాగా మరోసారి జతకట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో గట్టి టాక్ టాక్ వినిపిస్తోంది. అయితే రెబల్ స్టార్ ప్రజెంట్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ (Mythri Movie Makers)నిర్మస్తోన్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేస్తారట. ఇప్పటికే నటి ఇమాన్వీని సెలక్ట్ చేశారు. తాజాగా రెండో ముద్దుగుమ్మ కోసం బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకుందామని ఆలోచనలో ఉన్నారట దర్శక, నిర్మాతలు. ఈ విషయం మీదే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయంటూ సమాచారం.

మరికొంతమందెమో ఆల్రేడీ దిశా పటానీని ఎంపిక చేసుకున్నారంటూ చర్చించుకుంటున్నారు. మరీ ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. ప్రభాస్-దిశా పటానీ మరోసారి జతకడితే మూవీ పక్కా హిట్ అవుతుందని.. ఇది వీరిద్దరికి రెండో చిత్రమవుతుందని నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా అనంతరం కల్కికి కొనసాగింపు రానుందని తెలుస్తోంది.

Next Story