- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘విశ్వంభర’ సెట్స్‌లోకి బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ.. ఫైనల్ షెడ్యూల్‌లో స్పెషల్ సాంగ్!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘విశ్వంభర’(Vishvambhara).

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘విశ్వంభర’(Vishvambhara). సోషియో-ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి వశిష్ట (Director Vashishta)దర్శకత్వం వహిస్తుండగా.. త్రిష(Trisha) హీరోయిన్‌గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు వశిష్ట. ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ తాజాగా స్టార్ట్ అయినట్లు మెగాస్టార్ చిరంజీవి సెట్స్‌లో జాయిన్ అయినట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా సెట్స్‌లో ఉన్న చిరు ఫొటోను పంచుకున్నాడు. అయితే ఈ లాస్ట్ షెడ్యూల్‌లో పాటను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఓ రీమిక్స్ సాంగ్ ఉండబోతోందని ప్రచారం జరుగుతుండగా.. అందులో చిరుతో బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా.. తాజాగా మౌనీ రాయ్(Mouni Roy) కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టా వేదికగా ‘నేను హైదరాబాద్‌లో ఉన్నా’ అంటూ ఓ స్టోరీ పోస్ట్ చేసింది. దీంతో.. చిరు ‘విశ్వంభర’ స్పెషల్ సాంగ్‌లో మౌనీ రాయ్ దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తుండగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన రెండు పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి(M.M. Keeravani) సంగీతం అందిస్తున్నారు.






