- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Surveen Chawla: ఇండస్ట్రీపైనే అసహ్యం వేసింది.. ఇవన్నీ నాకు అవసరమా అనిపించింది.. కాస్టింగ్ కౌచ్‌పై నటి షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా.. రాజు మహారాజు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.

దిశ, సినిమా: బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా.. రాజు మహారాజు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. అలాగే.. సేక్రెడ్ గేమ్స్, రానా నాయుడు, క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్ వంటి వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న ఈమె.. త్వరలో మండల మర్డర్స్ అనే ఓటీటీ మూవీతో రాబోతుంది. వాణీ కపూర్, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా జులై 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుర్వీన్ చావ్లా కాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘ఒకానొక టైమ్‌లో కాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా ఉండేది. దేనికైనా సరే.. మాకేంటి? అంటూ డైరెక్ట్‌గా మాడ్లేవారు. ఆ పరిస్థితుల్లో నాకు బయటకు వెళ్లాలంటే కూడా అసహ్యంగా అనిపించేది. అసలు ఇవన్నీ అవసరమా యాక్టింగ్ మానేసి ఇంటికి వెళిపోతే మంచిది కదా అంటూ నన్ను నేను తిట్టుకునేదాన్ని. అలా వాళ్లు అడిగిన వాటికి ఒప్పుకోకపోవడంతో నాకు చాలా ఆఫర్లు చేజారాయి. చివరకు రోడ్డుమీర పడ్డట్టు అయింది. ఆ టైమ్‌లో చాలా కష్టంగా నడిచింది. ఇండస్ట్రీకి వచ్చింది దీనికోసమేనా అని నిరాశచెందేదాన్ని. ఇవన్నీ నా వల్ల కాదు.. సినిమాలు మానేద్దాం అనుకున్న రోజులు కూడా ఉన్నాయి’ చెప్పుకొచ్చింది సుర్వీన్.






