- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NBK111లో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ
నందమూరి నటసిహం బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ రాబోతుంది.

దిశ, సినిమా: నందమూరి నటసిహం బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ రాబోతుంది. NBK 111 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. మొదట ఈ చిత్రంలో నయనతారను ఫిక్స్ చేసినట్లు వార్తలు రాగా.. తర్వాత కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది.
బాలయ్య సినిమా అంటేనే స్పెషల్ సాంగ్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు NBK 111 కోసం ఈ సారి దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక స్పెషల్ ఐటెమ్ సాంగ్‌ను ప్లాన్ చేసినట్లు టాక్. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రిను ఎంపిక చేసినట్లు సమాచారం. ‘రాక్ స్టార్’, ‘హౌస్ ఫుల్ 5’ వంటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నర్గీస్ ఫక్రీ ఇప్పుడు బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసేందుకు సిద్ధం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ మాస్ పాట షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో ఈ వారం నుంచి షూటింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.






