Kajol: కొత్త షో స్టార్ట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ.. స్టార్ హీరోలతో ఇక ముచ్చట్లే! (పోస్ట్)

by Chukka Sudharani |

బాలీవుడ్ స్టార్ నటి కాజోల్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది.

Kajol: కొత్త షో స్టార్ట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ.. స్టార్ హీరోలతో ఇక ముచ్చట్లే! (పోస్ట్)
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి కాజోల్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఈ క్రమంలోనే త్వరలో ఈ బ్యూటీ ఓటీటీ మూవీ ‘సర్జమీన్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, ఇబ్రహీం అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ జియో హార్ట్ స్టార్‌లో ఈనెల 25న స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇక అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇలా సినిమాలతో బిజీగా ఉన్న కాజోల్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా తానొక న్యూ టాక్ షోను స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఇందులో కాజోల్‌తో పాటు మరో బాలీవుడ్ తారా ట్వింకిల్ ఖన్నా కూడా భాగం కాబోతుంది. వీరిద్దరు హోస్ట్ చేస్తున్న ఈ న్యూ టాక్ షో పేరును తెలియజేస్తూ కాజోల్ ఓ పోస్ట్ రిలీజ్ చేసింది. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే పేరుతో రాబోతున్న ఈ టాక్ షోకు బాలీవుడు బడా బాబులు ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి ప్రములు రాబోతున్నట్లు తెలుస్తోంది. ‘మన దగ్గరి టీ ఉంది.. దానిని మిస్ చేసుకోవడం చాలా కష్టం TwoMuchOnPrime త్వరలో వస్తుంది’ అంటూ కాజోల్ ఓ పోస్టర్ రిలీజ్ చేయగా.. అందులో కాజోల్ అండ్ ట్వింకిల్ ఖన్నా లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లింక్

Next Story