- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన ఎంతోమందికి స్ఫూర్తి.. పాన్ ఇండియా స్టార్‌పై బాలీవుడ్ నటుడు ప్రశంసలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రశంసలు కురిపించారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్‌లో ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్న ఈయన డార్లింగ్ వ్యక్తిత్వంపై చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా.. ప్రభాస్ పట్టుదలతో తన పని తాను పూర్తి చేస్తున్నారు. మౌనంగా తన పని తాను చేసుకునే విధానం నాకు చాలా నచ్చుతుంది. అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ అందరితో కలిసిపోయి ఉంటారు. స్టార్‌డమ్ ఏమాత్రం చూపించరు. గర్వం అసలు ఉండదు. ముఖ్యంగా లోకేషన్‌కు ఆయన తీసుకువచ్చే రుచికరమైన వంటల గురించి మాటల్లో చెప్పలేం. ఆయన ఎంతోమందికి స్ఫూర్తి’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను టి-సిరీస్ అండ్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ కలిసి నిర్మిస్తున్నారు..ఈ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






