- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Dev: బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ మరణంపై క్లారిటీ ఇచ్చిన సోదరుడు..?
బాలీవుడ్ ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అయితే అతని మరణానికి గల కారణాలు అప్పట్లో స్పష్టంగా తెలియరాలేదు. ముకుల్ దేవ్ మరణానికి గల అసలు కారణాలను ఆయన సోదరుడు రాహుల్ దేవ్ (Rahul Dev) తాజాగా పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అందరూ అనుకుంటున్నట్లు ముకుల్ డిప్రెషన్‌తో చనిపోలేదని, గత కొన్నేళ్లుగా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడమే మరణానికి దారితీసిందన్నారు. ముకుల్ వారం రోజులకు పైగా ఐసీయూలో ఉన్నాడని ముకుల్ దేవ్ మరణంపై అతని సోదరుడు రాహుల్ దేవ్ స్పష్టత ఇచ్చారు.
అతను డిప్రెషన్‌తో బాధపడుతున్నాడనే వార్తలను రాహుల్ దేవ్ ఖండించారు. ముకుల్ ఆకలితో అలమటించడం వల్లే మరణించారని, కొన్ని రోజుల నుండి ఏమి తినలేదని చెప్పారు. ముకుల్ దేవ్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని, అతని కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారని రాహుల్ దేవ్ పేర్కొన్నారు.
ముకుల్ దేవ్, రాహుల్ దేవ్ ఇద్దరూ బాలీవుడ్ నటులే, రాహుల్ దేవ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. రాహుల్ దేవ్, తెలుగులో అతడు, సింహాద్రి, మున్నా, పౌర్ణమి వంటి సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు. ముకుల్ దేవ్ దస్తక్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ముకుల్ దేవ్ 54 సంవత్సరాల వయస్సులో మరణించారు.






