ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి బాలీవుడ్ నటుడు.. హైప్ పెంచుతున్న ట్వీట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Verma)చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఊహించని విధంగా హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి బాలీవుడ్ నటుడు.. హైప్ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Verma)చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఊహించని విధంగా హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక గత ఏడాది ఆయన దర్శత్వంలో వచ్చిన ‘హనుమాన్’ (hanuman) బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా ప్రశాంత్ వర్మ క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన జై హనుమాన్(Jai Hanuman), మహాకాళి(Mahakali) వంటి చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. వీటితో పాటు పలు చిత్రాలను తీసుకువచ్చేందుకు స్టార్ హీరోలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ‘మహాకాళి’ సినిమా బెంగాల్ సంస్కృతి, సాంప్రదాయాలు ఆధారంగా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే షూటింగ్ మొదలవగా.. ఇందులోంచి విడుదలై ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచింది. దీంతో ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా(Akshaye Khanna) చేరినట్లు సమాచారం. ‘మహాకాళి’ సినిమాలో ఆయన కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ వార్త విన్న వారంతా పక్కా హిట్ ఖాయం అని అంటున్నారు. కాగా, ఇటీవల అక్షయ్ ఖన్నా విలన్‌గా నటించిన ‘ఛావా’ మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. అలాగే భారీ కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Next Story