- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగ్రవాదులకు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి హెచ్చరిక
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పెహల్గాంలో అమాయక టూరిస్టులపై ఉగ్రమూకలు దాడి(Terror Attack)కి పాల్పడిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పెహల్గాంలో అమాయక టూరిస్టులపై ఉగ్రమూకలు దాడి(Terror Attack)కి పాల్పడిన విషయం తెలిసిందే. తుపాకులతో వచ్చి దాదాపు 28 మంది టూరిస్టులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపారు. ఈ ఘటన కేవలం భారత దేశాన్నే కాకుండా మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది. వివిధ దేశాల ప్రతినిధులు స్పందించి ఉగ్రదాడి(Terror Attack)ని ఖండించారు. ఇండియాలోని రాజకీయ నాయకులు, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు అలందరూ పార్టీలకు అతీతంగా స్పందించి ఉగ్రదాడిని ఖండించారు. తాజాగా ఉగ్రదాడిపై బాలీవుడ్(Bollywood) నటుడు ఇమ్రాన్ హష్మి(Emraan Hashmi) స్పందించారు. ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదానికి మతం లేదని చెప్పారు. పక్కా ప్లాన్‌తోనే ఈ దాడికి తెగబడ్డారని అన్నారు. మరోవైపు.. టూరిస్టులపై కాల్పులు జరిపిన టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే ఆ నలుగురి లొకేషన్లను నాలుగుసార్లు ట్రాక్ చేయగా.. వారు త్రుటిలో తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్ బలగాలు పహల్గాం చుట్టుపక్కల అడవులను జల్లెడ పడుతున్నాయి.






