ఐ మిస్ యు సో మచ్ అంటూ అతనితో క్లోజ్‌గా దిగిన ఫొటో షేర్ చేసిన బోల్డ్ బ్యూటీ.. పోస్ట్ వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-10 17:59:48  IST  )

‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఐ మిస్ యు సో మచ్ అంటూ అతనితో క్లోజ్‌గా దిగిన ఫొటో షేర్ చేసిన బోల్డ్ బ్యూటీ.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఈ భామకు ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మదే మెయిన్ రోల్ కావడంతో పాటు సినిమా కూడా సూపర్ హిట్ విజయం సాధించింది. అలాగే తన అందం, అభినయంతో కుర్రాళ్ల క్రష్ అయిపోయింది.

దీంతో ఈ భామ గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయి అమాంతం స్టార్ హీరోయిన్ రేంజ్‌లోకి వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ఆఫర్లు వచ్చినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం రాణించలేకపోయింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. కానీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో పాటు వ్యక్తిగత విషయాలు, సినిమా విశేషాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా హెబ్బా పటేల్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో కళ్యాణ్ యసస్వి(Kalyan Yasaswi) అనే వ్యక్తితో క్లోజ్‌గా ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే.. ఐ మిస్ యు సో మచ్ ఇట్ హర్ట్స్’ అంటూ సాడ్ ఎమోజీ జోడించింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఎవరు బాయ్ ఫ్రెండ్ ఆ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read More..

ఉప్పు, కారం ఎవ్రిథింగ్ నైస్ అంటూ స్పైసీ ఫొటోలు షేర్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. పోస్ట్ వైరల్

READ MORE ...

ఉప్పు, కారం ఎవ్రిథింగ్ నైస్ అంటూ స్పైసీ ఫొటోలు షేర్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. పోస్ట్ వైరల్





Next Story