ట్రెడిషనల్ డ్రెస్సులో బోల్డ్ బ్యూటీ.. సాఫ్ట్ గర్ల్‌గా ఉండటానికి ట్రై చేస్తున్నానంటూ పోస్ట్..

by Gugulothu.Kavitha |

‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ట్రెడిషనల్ డ్రెస్సులో బోల్డ్ బ్యూటీ.. సాఫ్ట్ గర్ల్‌గా ఉండటానికి ట్రై చేస్తున్నానంటూ పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఈ భామకు ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మదే మెయిన్ రోల్ కావడంతో పాటు సినిమా కూడా సూపర్ హిట్ విజయం సాధించింది. అలాగే తన అందం, అభినయంతో కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. దీంతో ఈ భామ గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయి అమాంతం స్టార్ హీరోయిన్ రేంజ్‌లోకి వెళ్లిపోతుంది అని అందరూ అనుకున్నారు.

కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ఆఫర్లు వచ్చినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం రాణించలేకపోయింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. కానీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో పాటు వ్యక్తిగత విషయాలు, సినిమా విశేషాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తాజాగా హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ చేసింది. అందులో వైట్ కలర్ పంజాబీ డ్రెస్సు, జడ, ఇయర్ రింగ్స్ పెట్టుకుని చాలా ట్రెడిషనల్‌గా రెడీ అయింది. ఇక ఈ పిక్‌ను బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘సాఫ్ట్ గర్ల్‌గా ఉండటానికి ట్రై చేస్తున్నాను’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్ట్ కింద నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story