- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bobby: చిరంజీవి అంటేనే భయమేస్తుంది.. మొన్న కూడా ఆ టెన్షన్ తప్పలేదు
'చిరు లీక్స్'తో భయపడుతుంటామని, ఇటీవల జరిగిన ఈవెంట్‌లో మాత్రం చిరంజీవి ఎలాంటి లీక్ ఇవ్వలేదని బాబి తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏ సినిమా ఈవెంట్‌కు హాజరైనా, తన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక ఆసక్తికరమైన విషయాన్ని అనుకోకుండా వెల్లడిస్తుంటారు. దీంతో అభిమానులు ప్రేమగా వాటిని 'చిరు లీక్స్' అని పిలుస్తుంటారు. ప్రస్తుతం చిరంజీవి, బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మెగా 158' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇటీవల చిరంజీవి 'చెన్నై లవ్ స్టోరీ' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ప్రసంగించారు.
అయితే ఈసారి తన సినిమా గురించి ఎలాంటి లీక్ ఇవ్వలేదు. తాజాగా 'నేను రెడీ' చిత్రంలోని 'కొంచెం కొంచెం' పాట విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు బాబి ఈ విషయంపై స్పందించారు. "చిరంజీవి గారు ఏ ఈవెంట్‌కు వెళ్లినా మా సినిమా గురించి ఏదైనా లీక్ చేస్తారేమో అని భయపడుతుంటాం. కానీ ఇటీవల జరిగిన ఈవెంట్‌లో మా సినిమా గురించి ఏమీ చెప్పలేదు. అందుకే 'థ్యాంక్యూ అన్నయ్య' అంటూ ఆయనకు మెసేజ్ కూడా పంపాను" అని బాబి తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






