ఆలియా భట్‌తో విభేదాలపై స్పందించిన బాబీ డియోల్.. వైరల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

ఈ సినిమా షూటింగ్ సెట్‌లో ఆలియా, బాబీ డియోల్ మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లను బాబీ డియోల్ ఖండించారు.

ఆలియా భట్‌తో విభేదాలపై స్పందించిన బాబీ డియోల్.. వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ఆలియా భట్, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆల్ఫా’. శివ్ రావేల్ దర్శకత్వంలో రాబోతుండగా.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జులై 10న థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, షాకింగ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమా షూటింగ్ సెట్‌లో ఆలియా, బాబీ డియోల్ మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లను బాబీ డియోల్ ఖండించారు. ఈ ఫేక్ వార్తలకు సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్‌ను చూసి తాను తీవ్రంగా ఆశ్చర్యపోయానని బాబీ డియోల్ తెలిపారు. గతంలో ఆలియా భర్త రణబీర్ కపూర్‌తో కలిసి ‘యానిమల్’ చేశానని.. ఇప్పుడు ఆలియాతో ‘ఆల్ఫా’ చేస్తున్నట్లు.. తాము ఎంతో ప్రశాంతంగా సినిమా పనులు చేసుకుంటుంటే కావాలనే అబద్ధపు రూమర్స్ సృష్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వారి దగ్గరకు తాను పర్సనల్‌గా వెళ్లి నిజాలు నిరూపించలేను కదా అని ఆయన ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే వార్తల్లో దాదాపు 90 శాతం అబద్ధాలే ఉంటాయని నమ్మకూడదని బాబీ డియోల్ స్పష్టం చేశారు.

Next Story