- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుహాస్ సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం.. సముద్రంలో మునిగిన పడవ
టాలీవుడ్ నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో, తమిళ దర్శకుడు వెట్రిమారన్ నిర్మిస్తున్న మండాడి సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం చెన్నై బీచ్ తీరంలో షూటింగ్ చేస్తుండగా టెక్నికల్ టీం ఉన్న పడవ బోల్తా పడింది.

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో, తమిళ దర్శకుడు వెట్రిమారన్ నిర్మిస్తున్న మండాడి సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం చెన్నై బీచ్ తీరంలో షూటింగ్ చేస్తుండగా టెక్నికల్ టీం ఉన్న పడవ బోల్తా పడింది. ఇద్దరు సిబ్బందితో పాటు కెమెరాలు ఇతర పరికరాలు సముద్రంలో పడిపోయాయి. అయితే నీటిలో పడినవారిని వెంటనే చిత్రబృందం కాపాడగా కెమెరాలు ఇతర సామాగ్రి సముద్రంలో కొట్టుకుపోయాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో చిత్రయూనిట్ ఊపిరిపీల్చుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సుహాస్ విలన్ పాత్రలో నటించగా తమిళ నటుడు సూరి హీరో పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఎక్కవ సన్నివేశాలు సముద్రంలోనే చిత్రించినట్టు పోస్టర్లలో కనిపిస్తోంది.
Next Story






