ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ ‘భూత్ బంగ్లా’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-29 12:01:33  IST  )

ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ ‘భూత్ బంగ్లా’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ ‘భూత్ బంగ్లా’. ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వామికా గబ్బి, పరేష్ రావల్, రాజ్ పాల్ యాదవ్ కీలక పాత్రలో నటించారు. అయితే ఈ మూవీ ఏప్రిల్ 17న థియేటర్స్‌లోకి వచ్చి బాక్సాఫీసును షేక్ చేసింది. నెలరోజులు దాటినా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. కాగా.. ఈ సినిమా కథ విషయానికొస్తే.. అక్షయ్ కుమార్.. అర్జున్ అనే పాత్రలో కనిపించగా.. లండన్‌లో జీవిస్తున్నట్లుగా చూపించారు. తన పూర్వికుల గ్రామానికి తిరిగి వస్తాడు. అక్కడ అతనికి ఒక పాత రాజభవనం వారసత్వంగా దక్కుతుంది. అయితే ఆ గ్రామంలో కొత్త పెళ్లికూతుళలను వెంటాడుతున్న ఓ శాపం ఉందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత వధుసర్ అనే దుష్టశక్తి పెళ్లికూతుళ్లను బలి తీసుకుంటుందని జానపద కథ గ్రామస్థులను భయభ్రాంతుకు గురి చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ శాపం వెనుక ఉన్న నిజాన్ని అర్జున్ ఎలా బయటపెట్టాడు.. తన కుటుంబాన్ని, గ్రామాన్ని ఎలా కాపాడుకున్నాడనేది ఈ మూవీ కథ అని తెలుస్తోంది. ఇక థియేటర్స్‌లో ప్రేక్షకులను హారర్ కామెడీ సినిమా ఓటీటీలో ఎంత మాత్రం మెప్పించనుందో చూడాలి.

‘ది రెడ్ బ్యాగ్’ సినిమా నుంచి హీరోయిన్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్.

Next Story