- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రీ రిలీజ్‌కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ హిట్ ‘సలార్’ మూవీ.. థియేటర్స్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?
గత కొద్ది రోజులు నుంచి బాక్సాఫీసు వద్ద రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: గత కొద్ది రోజులు నుంచి బాక్సాఫీసు వద్ద రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు థియేటర్స్‌లో డిజాస్టర్‌గా నిలిచిన సినిమాలు సైతం రీరిలీజ్‌లో పుంజుకుంటున్నాయి. బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. దీంతో టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు మళ్లీ థియేటర్స్‌లోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ బ్లాక్ బస్టర్ మూవీ కూడా రీ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ప్రభాస్(Prabhas), ప్రశాంత్ నీల్(Prashant Neel) కాంబోలో వచ్చిన వచ్చిన ‘సలార్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కేజీఎఫ్ ను మించి భారీ యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారు. అయితే ఇందులో శృతి హాసన్(Shruti Haasan) డార్లింగ్ సరసన హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమాను మార్చి 21న రీరిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే మార్చిలో వెంకటేష్(Venkatesh), మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు, కార్తీ యుగానికి ఒక్కడు, నాని, విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఎవడే సుబ్రహ్మణ్యం ఉండటం విశేషం. కాగా, ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. త్వరలో ‘రాజాసాబ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అలాగే సలార్-2, ఫౌజి, స్పిరిట్, కల్కి-2, వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అంతేకాకుండా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ‘కన్నప్ప’ సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఇందులోంచి ప్రభాస్ లుక్ విడుదలవగా భారీ అంచనాలను పెంచేసింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఇందులో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, అవ్రామ్, మోహన్ బాబు, వంటి స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదలవుతూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటున్నాయి.
Once again, #Salaar is RE-RELEASING on 𝐌𝐚𝐫𝐜𝐡 𝟐𝟏𝐬𝐭! 🛐🥵🔥 #Prabhas pic.twitter.com/ycSQbbPPmy
— Hail Prabhas (@HailPrabhas007) February 24, 2025






