Sreeleela: శ్రీలీలకు చేదు అనుభం.. అందరి ముందే పట్టుకుని లాగేసిన వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-10 12:55:14  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల(SreeLeela) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘పెళ్లి సందడి’సినిమాతో వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

Sreeleela: శ్రీలీలకు చేదు అనుభం.. అందరి ముందే పట్టుకుని లాగేసిన వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల(SreeLeela) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘పెళ్లి సందడి’సినిమాతో వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ భామ అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. వరుస ఆఫర్లు అందుకుని స్టార్ హీరోయిన్ అంత ఫేమ్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే నాలుగు చిత్రాలు ఫ్లాప్ కావడంతో శ్రీలీల క్రేజ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో కొద్ది కాలం పాటు సినిమాలకు దూరం అయిన ఈ భామ మళ్లీ ‘పుష్ప-2’(pushpa-2) మూవీతో ఫామ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ప్రజెంట్ ఈ అమ్మడు పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

అలాగే శ్రీలీల, కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) సరసన ‘అషికి-3’లో హీరోయిన్‌గా నటించనుంది. ఈ మూవీతోనే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుండటం విశేషం. దీంతో గత కొద్ది రోజుల ఈ అమ్మడు కార్తిక్‌తో పలు చోట్ల తిరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రీలీలకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కార్తిక్ ఆర్యన్‌తో వెళ్తుండగా.. ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది అభిమానులు ఆమెను లాగేసి గట్టిగా పట్టుకున్నారు. దీంతో జనాల మధ్యలో శ్రీలీల నలిగిపోయింది. అక్కడున్న కొంతమంది అది చూసిన షాక్ అయ్యారు. ఇక అది చూసిన తన బాడీగాడ్ అలర్ట్ అయి ఆమెను కాపాడి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎంత అభిమానం ఉంటే మాత్రం అలా చేయమేంటని మండిపడుతున్నారు.

Next Story