బర్త్‌డే స్పెషల్‌.. ‘పినాక’ నుంచి స్టార్ హీరో పోస్టర్ రిలీజ్.. సమర యోధుడి గెటప్‌లో గూస్‌బంప్స్ తెప్పిస్తున్న లుక్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-02 05:44:32  IST  )

కన్నడ స్టార్ హీరో, గోల్డెన్ స్టార్ గణేష్‌(Ganesh) నటిస్తున్న తాజా సినిమా ‘పినాక’(Pinaka).

బర్త్‌డే స్పెషల్‌.. ‘పినాక’ నుంచి స్టార్ హీరో పోస్టర్ రిలీజ్.. సమర యోధుడి గెటప్‌లో గూస్‌బంప్స్ తెప్పిస్తున్న లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ స్టార్ హీరో, గోల్డెన్ స్టార్ గణేష్‌(Ganesh) నటిస్తున్న తాజా సినిమా ‘పినాక’(Pinaka). కొరియోగ్రాఫర్‌ బి.ధనంజయ(B. Dhanunjaya) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్‌(TG Viswaprasad), కృతి ప్రసాద్‌(Krithi Prasad) ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులకు విజుల్‌ ట్రీట్‌ను ఇచ్చింది. రుద్ర, క్షుద్ర పాత్రల్లో హీరో గణేష్‌ అవతారాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేశాయి.

ఇక మునుపెన్నడూ ఎరుగని గ్రిప్పింగ్‌ స్టోరీ లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా హీరోకు సంబంధించిన మరో పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈరోజు గణేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు స్పెషల్ విష్ చేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక పోస్టర్‌లో గుర్రంపై హీరో నల్లటి దుస్తులు ధరించి సమర యోధుడులా ఉన్నాడు. చేతిలో కత్తి పట్టుకుని సైడ్‌కి చూస్తున్నాడు. అతని బ్యాక్‌గ్రౌండ్‌లో శత్రు సైనికులు గుర్రం మీద స్వారీ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story