- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Birthday Special: మళ్లీ ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చేస్తున్న ఎన్టీఆర్.. రీ రిలీజ్ కాబోతున్న హిట్ మూవీ
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజుల(Re Release) ట్రెండ్ నడుస్తోన్న సంగతి విదితమే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజుల(Re Release) ట్రెండ్ నడుస్తోన్న సంగతి విదితమే. అయితే వీటికి ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండడంతో, ప్రతి రెండు వారాలకు ఒక పాత సినిమాని రిలీజ్ చేస్తున్నారు. కొందరు సందర్భాన్ని బట్టి రీ-రిలీజులు ప్లాన్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం క్రేజ్‌ను క్యాష్ చేసుకోడానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్‌గా ఓ బ్లాక్ బస్టర్ మూవీని రీరిలీజ్ చేస్తున్నారు.
మే 20న మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజును జరుపుకోనున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ బర్త్ డేని ఈసారి మరింత స్పెషల్‌గా మార్చడానికి అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి ఎన్టీఆర్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన 'యమదొంగ' మూవీను రీ రిలీజ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా మే 18న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అలాగే మే 19, 20వ తేదీల్లోనూ స్పెషల్ షోలు వేయబోతున్నట్లు వెల్లడిస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. కాగా ఎన్టీఆర్ హీరోగా ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ కామెడీ మూవీ 2007 ఆగస్టు 15న విడుదల అయ్యి.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.






