- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బర్త్‌డే స్పెషల్: రీ రిలీజ్ కాబోతున్న ఐకాన్ స్టార్ లవ్ అండ్ ఎమోషనల్ మూవీ.. ట్వీట్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన మూవీ ‘ఆర్య-2’(Arya-2).

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కించిన మూవీ ‘ఆర్య-2’(Arya-2). కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో హీరో నవదీప్(Navdeep) కీ రోల్ ప్లే చేశారు. అయితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మించారు. కాగా ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందించాడు. ఇక ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మెయిన్‌గా లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక సాంగ్స్ గురించి అయితే స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అవి ఎవర్ గ్రీన్ సాంగ్స్ గానే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్లలో రీ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆర్య-2 మూవీను కూడా థియేటర్‌లో రీరిలీజ్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ బర్త్‌డే స్పెషల్‌గా ఏప్రిల్ 5న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.






