- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బర్త్ డే స్పెషల్.. ‘నాగబంధం’ నుంచి అనసూయ పవర్ ఫుల్ లుక్ రిలీజ్.. !
ఈ రోజు (మే 15) టాలీవుడ్ పాపులర్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు సందర్భంగా ‘నాగబంధం’ లుక్ విడుదల చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విరాట్ కర్ణ, గ్లామరస్ బ్యూటీస్ ఐశ్వర్య మీనన్, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ఫాంటసీ థ్రిల్లర్ ‘నాగబంధం’. భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాల రహస్యం, నాగబంధం అనే ఆధ్యాత్మిక కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తుండగా.. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని చిత్రబృందం చెబుతోంది. అలాగే ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అవినాష్, ఈ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ అఘోరా పాత్రలో కనిపిస్తుండటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న.. ఈ సినిమా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది.
ఈక్రమంలో.. తాజాగా, ఈ మూవీ అప్డేట్ విడుదల చేసి హైప్ క్రియేట్ చేశారు. ఈ రోజు (మే 15) టాలీవుడ్ పాపులర్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు సందర్భంగా ‘నాగబంధం’ లుక్ విడుదల చేశారు. చిత్రబృందం ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతూ.. సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఒక పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో అనసూయ ‘లీలావతి అక్క’ అనే ఒక వైవిధ్యమైన, బలమైన పాత్రలో నటిస్తోంది. విడుదలైన పోస్టర్‌లో అనసూయ లుక్ చాలా భయంకరంగా, ఆకట్టుకునేలా ఉంది. ఆమె కళ్లకు దట్టంగా కాటుక పెట్టుకుని, ఎంతో కోపంగా ఎవరినో చూస్తున్నట్లుగా ఉంది. ఆమె ముందు ఎన్నో నాగుపాములు పడగలు విప్పి కోపంగా బుసలు కొడుతున్నట్లు ఈ పోస్టర్‌లో చూపించారు. నాగులతో సాహసం చేసే పాత్ర చేస్తున్నట్లు టాక్. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమాలో అనసూయ క్యారెక్టర్ చాలా నెగెటివ్ షేడ్స్‌తో, కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని అర్థమవుతోంది.






