- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాన్వీ కపూర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన బిర్లా వారసురాలు.. దాని ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే..(వీడియో)
అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ భామ తెలుగులో కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన ‘దేవర’(Devara) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తన ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ సాధించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘పెద్ది’ మూవీలో నటిస్తుంది. రామ్ చరణ్(Ram Charan) హీరోగా ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఇక ఈ చిత్రానికి ఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇందులో స్టార్ యాక్టర్ జగపతి బాబు(Jagapathi Babu), శివరాజ్ కుమార్(Shivaraj Kumar) అలియాస్ శివన్న, దివ్వేంద్(Devend) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ సినిమాను భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బిర్లా వారసురాలు, ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా(ananya birla), జాన్వీ కపూర్ చాలా కాలంగా మంచి స్నేహితులు. ఇటీవల అనన్య బ్యూటీ ప్రొడక్ట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే, ఈ బ్రాండ్‌కు జాన్వీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇక తన బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రాండ్‌కు జాన్వీ సహకరిస్తున్నందుకు కానుకగా అనన్య ఖరీదైన లంబోర్ఘిని కారును ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే దాని ధర రూ.5 కోట్లు కావడం గమనార్హం.
ఇక శుక్రవారం ఉదయం లిలాక్ (పర్పుల్) రంగు లంబోర్ఘిని కారు జాన్వీ నివాసానికి చేరుకుంది. ఈ కారుతో పాటు మరో గిఫ్ట్ ప్యాక్ కూడా ఉంది. దీనిపై “ప్రేమతో, నీ అనన్య” అని రాసి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మాకు కూడా ఇలాంటి ఫ్రెండ్ దొరికితే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






