- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శర్వానంద్ సినిమా ఓటీటీ డీల్.. లాభాల్లో నిర్మాతలు
చార్మింగ్ స్టార్ శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.

దిశ, సినిమా : చార్మింగ్ స్టార్ శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఆలస్యం చేయకుండా తన తర్వాతి ప్రాజెక్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘లవ్, స్పీడ్, శాక్రిఫైజ్, కరేజ్ కథే ‘ది బైకర్’.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతుంది.. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది’ అని తెలిపారు. యూ్వీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మిస్తున్న ఈ యూనిక్ బైక్ రేసింగ్ జానర్ ఫిల్మ్.. ఇండియాలో ఫస్ట్ అని తెలుస్తోంది. ఇందుకోసం నిర్మాతలు రూ. 50 కోట్ల బడ్జెట్ కేటాయించారని.. ఓటీటీ డీల్‌తో మొత్తానికి రిలీజ్‌కు ముందే లాభాల్లోకి వచ్చేశారని తెలుస్తోంది. ఇక అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి దర్శకులు కాగా మ్యూజిక్ జిబ్రాన్ అందిస్తున్నారు.






