బీహార్ లో తెగించిన కుర్రాళ్ళు..అల్లు అర్జున్ మేనరిజంతో నడిరోడ్డుపైనే !

by velandi.Saikiran |

పుష్ప 2 చూసిన బీహార్ కుర్రాళ్ళు... అల్లు అర్జున్ తరహాలో తగ్గేదేలే అంటూ.. రోడ్ల పైన రెచ్చిపోతున్నారు.

బీహార్ లో తెగించిన కుర్రాళ్ళు..అల్లు అర్జున్ మేనరిజంతో నడిరోడ్డుపైనే !
X

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్... చాలా రికార్డులను బద్దలు కొట్టాడు. అప్పటివరకు సాధారణ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్... పుష్ప హిట్ కారణంగా ఐకాన్ స్టార్ అయిపోయాడు. అంతేకాదు పుష్ప సినిమాలో అద్భుతమైన నటనతో... జైలుకు పంపించిన సీఎం రేవంత్ రెడ్డి తోనే అవార్డు దక్కించుకున్నాడు అల్లు అర్జున్.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ అలాగే బీహార్ లాంటి ప్రాంతాల్లో కూడా అల్లు అర్జున్ కు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కంటే బీహార్ లోనే అల్లు అర్జున్ ఎక్కువ ఫాన్స్ ఉన్నారని చెబుతారు. అల్లు అర్జున్ కు సంబంధించిన ఏ సినిమా వచ్చినా... జనాలు ఎగబడి చూస్తారు.

ఇది ఇలా ఉండగా... పుష్ప అలాగే పుష్ప 2 చూసిన బీహార్ కుర్రాళ్ళు... అల్లు అర్జున్ తరహాలో తగ్గేదేలే అంటూ.. రోడ్ల పైన రెచ్చిపోతున్నారు. ఓ మ్యూజిక్ పెట్టుకుని.. అల్లు అర్జున్ తరహా లోనే మేనరిజాన్ని ప్రదర్శిస్తూ నడిరోడ్డు పైన రెచ్చిపోయారు. ఈ సందర్భంగా ఊళ్లో వాళ్లంతా వచ్చి ఈ కుర్రాళ్ల రచ్చను... కళ్ళారా చూశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Twitter Link




Next Story