Kanchana-4: కాంచాన-4 షూటింగ్‌పై బిగ్గెస్ట్ అప్డేట్.. ఆనందంలో ఫ్యాన్స్

by Chukka Sudharani |   (  Updated:2025-07-12 14:43:25  IST  )

మల్టీ స్టారర్‌గా దూసుకుపోతున్న రాఘవ లారెన్స్ డైరెక్షన్‌లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాల్లో ‘ముని’ ఒకటి.

Kanchana-4: కాంచాన-4 షూటింగ్‌పై బిగ్గెస్ట్ అప్డేట్.. ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: మల్టీ స్టారర్‌గా దూసుకుపోతున్న రాఘవ లారెన్స్ డైరెక్షన్‌లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాల్లో ‘ముని’ ఒకటి. 2007లో వచ్చిన ఈ సినిమా కంప్లీట్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. తర్వాత ముని ఫ్రాంచైజీస్‌లో భాగంగా ‘కాంచన’ రాగా.. కామెడీ, హారర్ సీన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని గన విజయం సాధించింది. దీంతో.. కాంచన-2, కాంచన-3కూడా విడుదలయ్యాయి.

ఇప్పుడు దాదాపు 6 సంవత్సారాల తర్వాత కాంచన-4 తెరకెక్కించే పనిలో పడ్డాడు లారెన్స్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక రీసెంట్‌గా మహాబలిపురంలో షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఇందులో లారెన్స్, పూజా హెగ్డేతో పాటు ముఖ్య తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తదుపరి దశ చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తుండగా.. ఇదే ఈ మూవీకి లాస్ట్ షెడ్యూల్‌గా టాక్. ఇక ఈ షూటింగ్ కూడా కంప్లీ్ట్ అయితే త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు మేకర్స్.

Next Story