Akshay Kumar: అక్షయ్ కుమార్ ‘OMG 3’పై బిగ్గెస్ట్ అప్‌డేట్.. ఆనందంలో ఫ్యాన్స్

by Chukka Sudharani |

అక్షయ్ కుమార్ (Akshay Kumar), పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi), యామీ గౌతమ్ (Yami Gautam) ప్రధాన పాత్రలో నటించిన ‘OMG’ చిత్రం ఎలాంటి హిట్ అందుకుందో అందరికి తెలిసిందే.

Akshay Kumar: అక్షయ్ కుమార్ ‘OMG 3’పై బిగ్గెస్ట్ అప్‌డేట్.. ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: అక్షయ్ కుమార్ (Akshay Kumar), పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi), యామీ గౌతమ్ (Yami Gautam) ప్రధాన పాత్రలో నటించిన ‘OMG’ చిత్రం ఎలాంటి హిట్ అందుకుందో అందరికి తెలిసిందే. 2012లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. దీంతో దీనికి సీక్వెల్‌గా 2023లో ‘OMG-2’ కూడా వచ్చింది. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరుణ భాటియా, విపుల్ డి.షా, రాజేష్ బహల్, అశ్విన్ వర్దే, అక్షయ్ కుమార్ నిర్మించారు. ఇక ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ ‘OMG’ ఫ్రాంచైజీలో మూడో భాగం తెరకెక్కబోతున్నట్లు బాలీవుడ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మేరకు నెట్టింట ఓ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఇందులో ‘OMG అండ్ OMG 2 సినిమాల భారీ విజయాల తర్వాత.. నటుడు అక్షయ్ కుమార్, దర్శకుడు అమిత్ రాయ్ ఫ్రాంచైజీ యొక్క మూడవ భాగం కోసం సిద్ధం అయ్యారు. ఇటీవల కేరళలో కలిసి ఉన్న సమయంలో వీరిద్దరూ OMG 3 కోసం ఆలోచనలు మొదలుపెట్టినట్లు సమాచారం. అంతే కాకుండా.. స్క్రిప్ట్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, 2026లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది’ అంటూ షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story