AK64కు సర్వం సిద్ధం.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం తన 64 సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు.

AK64కు సర్వం సిద్ధం.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ప్రస్తుతం తన 64 సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. ఆదిక్ రవిచంద్రన్ (Adik Ravichandran) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే కోలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఈనెలలో ఉండనుందట.

అలాగే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారట మేకర్స్. AK64ను 2026లో సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దీంతో ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకోగా.. త్వరలో అనౌన్స్‌మెంట్ ఇచ్చి షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story