DD Next Level : ఓటీటీలోకి ది బెస్ట్ హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Chukka Sudharani |

తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ‘డీడీ నెక్ట్స్ లెవెల్’ (DD Next Level).

DD Next Level : ఓటీటీలోకి ది బెస్ట్ హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ‘డీడీ నెక్ట్స్ లెవెల్’ (DD Next Level). బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న హారర్ కామెడీ చిత్రం ‘డీడీ’ ఫ్రాంచైజీలో వచ్చిన నాలుగో భాగం ఇది. ఎస్.ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్మెంట్, ది షో పీపుల్ బ్యానర్‌లపై వెంకట్ బోయనపల్లి, ఆర్య సంయుక్తంగా నిర్మించారు. ఇందులో గౌతం వాసుదేవ్ మీనన్, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ మే 16 థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది.

ఇందులో సంతానం.. సోషల్ మీడియా ఇన్స్‌ఫ్లూయెన్సర్ పాత్రలో నటించగా.. ఓ దెయ్యాల థియేటర్‌కు మూవీ చూసేందుకు వెళ్లి ఫ్యామిలీతో పాటు అక్కడ ఇరుక్కుపోతాడు. అక్కడ నుంచి సంతానం తన ఫ్యామిలీతో ఎలా బయటపడ్టాడు అనేది ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5.. ఈ సినిమా రైట్స్‌ను సొంతం చేసుకోగా ‘ఇది హారర్ సినిమా కాదు.. హారర్ సినిమా లోపల హారర్ సినిమా. 2025 లో అతిపెద్ద హారర్ కామెడీ బ్లాస్ట్.. DDNextLevel జూన్ 13 నుండి ZEE5 లో ప్రసారం అవుతుంది’ అని తెలిపింది.

Next Story