Sankranthiki Vasthunnam : వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్.. ఐదు రోజుల్లో " సంక్రాంతికి వ‌స్తున్నాం " ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

by Phanindra |   (  Updated:2025-01-19 06:46:28  IST  )

ఈ రోజు ఇంకా కలెక్షన్స్ పెరిగే అవ‌కాశం ఉందని సినీ వర్గాల చెబుతున్నారు.

Sankranthiki Vasthunnam : వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్.. ఐదు రోజుల్లో  సంక్రాంతికి వ‌స్తున్నాం  ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్ ( Venkatesh ) హీరోగా " సంక్రాంతికి వ‌స్తున్నాం" ( Sankranthiki Vasthunam ) మూవీ కూడా జ‌న‌వ‌రి 14న ఆడియెన్స్ ముందుకొచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ తో దూసుకువెళ్తుంది. ముఖ్యంగా, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా అలరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఊచకోత కోస్తుంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది.

తాజాగా, ఈ సినిమా ఐదు రోజుల్లో ఈ మూవీ రూ.161 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఇది వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్. శని వారం సెలవు కావడంతో నిన్న ఒక్క రోజే రూ. 31 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ రోజు ఇంకా పెరిగే అవ‌కాశం ఉందని సినీ వర్గాల చెబుతున్నారు. వెంకటేష్ సరసన మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేశ్ లు హీరోయిన్స్ గా న‌టించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి సంగీతాన్ని అందించారు.


Next Story