Bigg Boss Telugu Season 7 Host : బిగ్ బాస్-7 హోస్ట్ ఎవరో తెలుసా..?

by Chukka Sudharani |   (  Updated:2023-06-22 11:55:24  IST  )

బుల్లితెరపై ప్రసారం అవుతున్న షోల్లో బిగ్ బాస్‌కు ఎంత ఆధరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Bigg Boss Telugu Season 7 Host : బిగ్ బాస్-7 హోస్ట్  ఎవరో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రసారం అవుతున్న షోల్లో బిగ్ బాస్‌కు ఎంత ఆధరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పడు మరో సీజన్‌తో ప్రజల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఈ క్రమంలోనే షోకి కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు..? హోస్ట్‌గా ఎవరు చేస్తారు..? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇప్పటికే కొంత మంది కంటెస్టెంట్స్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నప్పటికి ఇంకా వాటిపై పూర్తి క్లారిటీ రాలేదు.

ఇక హోస్ట్ విషయానికి వస్తే.. గతంలో నాగార్జున చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ప్లేస్‌‌లో బాలకృష్ణ, రానా, విజయ్ దేవరకొండ ఈ మూడు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురులో హోస్ట్‌గా ఎవరు వస్తారు అనే విషయంలో ప్రజల్లో ఆశక్తి నెలకొంది. తాజా సమాచారం మేరకు.. బిగ్ బాస్-7 సీజన్‌కి కూడా నాగార్జునే హోస్ట్‌గా ఉంటారని తెలుస్తుంది. నిర్వాహకుల ఆలోచన మేరకు హోస్ట్‌లో మార్పు ఉండటం లేదని సమాచారం. నాగార్జున సైతం ఈ షో చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు వినికిడి. చూడాలి మరి ఈ సీజన్ ఎలా ఉంటుందో.

Also Read..

Hansika Motwani యోగా భంగిమలు చూస్తే మతిపోవాల్సిందే.. ఎంత అందంగా ఉందో!

Next Story