ఆ ఇద్ద‌రు ఎలిమినేట్‌...బిగ్‌బాస్‌ హౌస్‌లో టాప్‌-5 వీళ్లే

by velandi.Saikiran |

డిమోన్ పవన్, ఇమాన్యుయల్, సంజన గల్రానీ, తనుజా, కళ్యాణ్ పడాల టాప్ 5లో నిలిచారు. ఈ వారం బిగ్ బాస్ సీజన్ 9లో రెండు

ఆ ఇద్ద‌రు ఎలిమినేట్‌...బిగ్‌బాస్‌ హౌస్‌లో టాప్‌-5 వీళ్లే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు వచ్చేసింది. ఈ షో మరో వారం రోజులు మాత్రమే కొనసాగనుంది. దాదాపు ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. తాజాగా బిగ్ బాస్ 9 ఫైనల్ కు చేరుకున్న టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు అనేది తేలిపోయింది. ఈ మేరకు ఆదివారం రోజు జరిగిన షోలో ఆ టాప్ 5 కంటెస్టెంట్ల పేర్లు రివీల్ అయ్యాయి. డిమోన్ పవన్, ఇమాన్యుయల్, సంజన గల్రానీ, తనుజా, కళ్యాణ్ పడాల టాప్ 5లో నిలిచారు. ఈ వారం బిగ్ బాస్ సీజన్ 9లో రెండు ఎలిమినేషన్స్ ఉన్నాయి.

ఈ తరుణంలో శనివారం రోజున సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. ఇవాళ ఆదివారం భరణి ఎలిమినేట్ అయిపోయాడు. ఇక మరో వారం రోజుల్లో విజేత ఎవరు అనేది తేలనుంది. డిసెంబర్ 21న బిగ్ బాస్ సీజన్ 9 విజేతను ప్రకటిస్తారు. ప్రాథమిక సమాచారం ప్రకారం తనుజా విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Next Story