- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉదయ్ కిరణ్ చనిపోవడమే బెటర్.. టాలీవుడ్ నటుడు సంచలనం !
టాలీవుడ్ సీనియర్ హీరో ఉదయ్ కిరణ్ ( UDAY KIRAN) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో ఉదయ్ కిరణ్ ( UDAY KIRAN) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రేంజ్ లో.. ఇండస్ట్రీని ఏలాడు ఉదయ్ కిరణ్. ఇండస్ట్రీ పెద్దల సపోర్ట్ లేకపోయినా.. చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ... స్టార్ హీరో అయ్యాడు. చిత్రం, నువ్వు నేను, నీ స్నేహం, మనసంతా నువ్వే, లాంటి ఎన్నో ప్రేమకథా చిత్రాలు తీసి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు ఉదయ్ కిరణ్. అయితే అలాంటి ఉదయ్ కిరణ్.. 33 సంవత్సరాల వయసులోనే ఆత్మహత్య చేసుకొని అందరిని వదిలి వెళ్ళిపోయాడు.
ఆయన కెరీర్... ఓ రేంజ్ లో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక అనేక రకాల కథనాలు వచ్చాయి. అయితే దీనికి పై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ( Koushal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ బతకడం కంటే.. చనిపోవడం మంచిదైంది అంటూ బాంబు పేల్చాడు. తాను 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను... ఇక్కడ ఎదుగుతున్న వాళ్లను తొక్కేస్తూ ఉంటారు అని పేర్కొన్నాడు.
ఉదయ్ కిరణ్ ను కూడా మానసికంగా చాలా వేధించారు... నేను దగ్గరుండి చూశాను అని ఈ సందర్భంగా పేర్కొన్నాడు కౌశల్. అలాంటి టార్చర్ తో బతకడం కంటే చనిపోవడం మంచిదేమో.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన తర్వాత ఉదయ్ కిరణ్ ఆత్మకు శాంతి దక్కుతుందని ఆశిస్తున్నట్లు ఎమోషనల్ అయ్యాడు.






