- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బిగ్ బాస్ హాట్ బ్యూటీ.. ఫైనల్లీ అంటూ నిశ్చితార్థం ఫొటోలు షేర్..
బిగ్‌బాస్ ఫేమ్ శుభశ్రీ(Shubhasree) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ ఫేమ్ శుభశ్రీ(Shubhasree) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ సీజన్-7లో కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టి తన క్యూట్ క్యూట్ మాటలతో అక్కడి వారిని పడేసింది. అలాగే నా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే డైలాగ్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’(Amigos) మూవీలో ఓ చిన్న రూల్‌లో కనిపించింది. అలా తెలుగు(Telugu), తమిళ(Tamil) భాషలలో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అయితే ఈ బ్యూటీకు సినిమాల కంటే ఎక్కువగా బిగ్ బాస్(Biss Boss) షో ద్వారానే బాగా ఫేమస్ అయింది.
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత శుభశ్రీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ భామ తన ప్రియుడితో కలిసి నిశ్చితార్థం చేసుకున్నట్లు అభిమానులకు తెలియజేస్తూ.. ‘ఫైనల్లీ వి ఆర్ ఎంగేజెడ్’ అంటూ నిశ్చితార్థం ఫొటోస్ షేర్ చేసింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.
కాగా ఈ అమ్మడు చేసుకోబోయే అతని పేరు అజయ్ మైసూర్(Ajay Mysore).. అలియాస్ ఏజే మైసూర్. అతను సినీరంగంలో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’, ‘టెన్త్ క్లాస్ డైరీస్’ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే అటు నిర్మాణ రంగంలోనూ కొనసాగుతున్నారు. ఇక శుభ శ్రీ, ఏజే మైసూర్ కలిసి ఇటీవల ‘మెసెస్టీ ఇన్ లవ్’ అనే కవర్ సాంగ్ చేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలెక్కనున్నారు.






