Shanmukh Jaswanth: ప్రేయసితో బిగ్‌బాస్‌ షణ్ముఖ్‌ ఎంగేజ్‌మెంట్‌

by velandi.Saikiran |   (  Updated:2026-02-25 18:18:00  IST  )

వైష్ణవి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు షణ్ముఖ్ జస్వంత్.

Bigg Boss Fame Shanmukh Engaged to Vaishnavi
X

Bigg Boss Fame Shanmukh Engaged to Vaishnavi

దిశ‌, వెబ్ డెస్క్‌: పెళ్లిళ్ల సీజన్ షురూ అయింది. దీంతో రోజుకు వేలాది సంఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కొంతమంది ఎంగేజ్మెంట్ కార్యక్రమాలను కూడా ఫినిష్ చేసుకుంటున్నారు. మార్చి, ఏప్రిల్, మే ఇలా మూడు నెలల పాటు బ్రహ్మాండమైన ముహూర్తాలు ఉన్నాయట. దీంతో లక్షల్లో జంటలు పెళ్లికి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ సెలబ్రిటీ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ( Shanmukh Jaswanth ) ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వైష్ణవి అనే అమ్మాయితో తాజాగా షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో షణ్ముఖ్ జస్వంత్ జంట‌కు శుభ‌కాంక్ష‌లు చెబుతున్నారు ఫ్యాన్స్‌.

వైష్ణవితో షణ్ముఖ్ జస్వంత్ నిశ్చితార్థం

యూట్యూబర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన షణ్ముఖ్ జస్వంత్, అదిరిపోయే శుభవార్త చెప్పాడు. త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు షణ్ముఖ్ జస్వంత్. తాజాగా వైష్ణవి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు షణ్ముఖ్ జస్వంత్. కొన్ని రోజుల కిందట ముఖం చూపించకుండా ఓ అమ్మాయిని పరిచయం చేశాడు షణ్ముఖ్ జస్వంత్. అయితే ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులందరికీ మంచి ట్రీట్ ఇచ్చాడు. బుధవారం ఫిబ్రవరి 25వ తేదీన ప్రేయసి వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించి ఫోటోలను కూడా పంచుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. షణ్ముఖ్ జస్వంత్ - వైష్ణ‌వి జంట కలకాలం కలిసి ఉండాలని కోరుతూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. షణ్ముఖ్, వైష్ణవి జోడి అద్భుతంగా ఉందని మరి కొంతమంది అంటున్నారు.

షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన ప్రేమ బ్రేకప్.. కట్ చేస్తే

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయ‌న‌ ఇద్దరు దాదాపు 5 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. అప్పట్లో ఈ జంట షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకునేది. అలాగే రొమాంటిక్ సాంగ్స్ లో కూడా వీళ్ళిద్దరూ నటించేవారు. అయితే 2021 సమయంలో షణ్ముఖ్ జస్వంత్ వ్యవహారం పైన సిరి హనుమంతు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆ తర్వాత షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన మధ్య దూరం పెరిగింది. ఆ దూరం కాస్త బ్రేకప్ దాకా వెళ్ళింది. 2022 జనవరి ఒకటో తేదీన దీప్తి సునయన సంచలన పోస్ట్ కూడా పెట్టారు. షణ్ముఖ్ జస్వంత్ తో విడిపోతున్నట్లు అధికారికంగా పేర్కొన్నారు. మా దారులు వేరు అంటూ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు. కట్ చేస్తే ఇప్పుడు వైష్ణవి ( Vaishnavi Chodisetti) అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే వైష్ణవిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని షణ్ముఖ్ జస్వంత్ గురించి వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అంతేకాదు పెళ్లి కూడా స‌న్నిహితుల స‌మ‌క్షంలోనే చేసుకోబోతున్నార‌ని టాక్‌.

Next Story