- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న బిగ్ బాస్ ఫేమ్ బ్యూటీ.. మోషన్ పోస్టర్ రిలీజ్
సోషల్ మీడియా, బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న రితిక.. ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నది.

దిశ, సినిమా: సోషల్ మీడియా, బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న రితిక.. ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ వై’. శ్రీ క్రిష్ పిక్చర్స్, శ్రీ ఇంటర్నేషనల్ బ్యానర్లపై సి.వి. కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం డిఫరెంట్ కంటెంట్‌తో రాబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే ఇదొక ప్రయోగాత్మక చిత్రమని అర్థం అవుతుండగా.. కథ ఏంటి? బ్యాక్ డ్రాప్ ఏంటి? అన్న విషయాల్ని రివీల్ చేయకుండా అందరిలోనూ ఆసక్తిని పెంచేశారు మేకర్స్. పిజ్జా, సూదు కవ్వుమ్, అట్టకత్తి, శరభం, ఇరుది సుట్రు, మాయావన్ లాంటి ప్రయోగాత్మక చిత్రాల తర్వాత సి.వి. కుమార్ ‘ఎక్స్ వై’తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం ఇలా అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇందులో రతికతో పాటు బ్రానా, అనిజ్ ప్రబాకర్, శ్రీదర్ తదితరులు నటిస్తున్నారు.






