- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నాకు రెండు జన్మలు కావాలి.. ఎందుకంటే’.. బిగ్‌బాస్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా మరింత ఫేమ్ దక్కించకుంది య దివి (Divi).

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా మరింత ఫేమ్ దక్కించకుంది య దివి (Divi). బీటెక్ కంప్లీట్ చేసిన ఈ అమ్మడు మూవీల్లోకి అడుగుపెట్టడానికి ముందు మోడలింగ్ వెళ్లానని ఈ నటి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. మొదటిసారిగా టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) హీరోగా నటించిన మహర్షి సినిమాలో ఓ సన్నివేశంలో కనిపించింది. అనంతరం ఈ ముద్దుగుమ్మ చిన్నా చితకా పాత్రలతో పాటు పలు కవర్ సాంగ్స్‌లో కూడా స్టెప్పులేసి నెటిజన్లను దగ్గరైంది.
అలాగే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) దివికి గాడ్ ఫాద్ సినిమాలో చాన్స్ కల్పించారు. బిగ్‌బాస్ సీజన్- 4 గ్రాండ్ ఫినాలేకు వచ్చినప్పుడు ఈ ఆఫర్ ఇచ్చారు. ఇక నయీం డైరీస్ (Naeem Diaries)రొమాంటిక్ సన్నివేశాల్లో లిమిట్స్ దాటి నటించి.. ప్రేక్షకులకు షాకిచ్చింది. అలాగే నవీన్ గాంధీ (Naveen Gandhi) దర్శకత్వంలో రూపొందించిన లంబసింగిలో తను కథానాయికగా నటించి మెప్పించింది.
కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఈ బ్యూటీ అందానికి, నటనకు మంచి మార్కులు పడ్డాయి అంతేకాకుండా దివి జీ 5 లో ప్రసారమైన మా నీళ్ల ట్యాంక్, ఏటీఏం వెబ్ సిరీస్‌ల్లో నటించి మెప్పించింది. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 లో కూడా దివి రిపోర్టర్‌గా కనిపించి.. జనాల్ని ఆకట్టుకుంది.
అంతేకాకుండా ఈ బ్యూటీ డాకు మహారాజ్(Daku Maharaj) లో నందమూరి బాలయ్య కు అనుచరురాలిగా నటించింది. అయితే తాజాగా దివి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘రెండు జన్మలు కావాలి నాకు. ఒకటి నిన్ను చూస్తూ ఉండిపోడానికి.. ఇంకొకటి నీ గురించి రాస్తూ ఉండిపోడానికి’’ అంటూ రాసుకొచ్చింది. అలాగే ఈ పోస్ట్‌లో ఆకట్టుకునే ఓ పిక్ కూడా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్ దివి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






