- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mehaboob: అతను మా జీవితాల్లో అంతులేని ఆనందాన్ని నింపాడు.. కొడుకు గురించి మెహబూబ్ ఎమోషనల్ పోస్ట్
ఫేమస్ యూట్యూబర్ మెహబూబ్ దిల్ సే(Mehboob Dil Se) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: ఫేమస్ యూట్యూబర్ మెహబూబ్ దిల్ సే(Mehboob Dil Se) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. పలు ప్రైవేట్ సాంగ్‌లో కనిపించిన ఆయన తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss)లో పాల్గొని ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. తనదైన స్టైల్లో టాస్కులు ఆడిన మెహబూబ్ విన్నర్ మాత్రం కాలేకపోయాడు. కానీ తను ఊహించనంత ఫేమ్ మాత్రం సంపాదించుకుని బుల్లితెరపై కొనసాగుతున్నాడు. అలాగే పలు ప్రైవేట్ సాంగ్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇటీవల శ్రీ సత్య(Sri Satya), మెహబూబ్ చేసిన ‘నువ్వే కావాలి’ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇక యూట్యూబ్‌లో సరికొత్త కంటెంట్‌ను తీసుకురావడంతో పాటు ఆయన సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నాడు. తాజాగా, మెహబూబ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బిగ్ గుడ్ న్యూస్ ప్రకటించాడు.
తన తమ్ముడికి కొడుకు పుట్టినట్లు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘నా సోదరుడు సుభాన్‌కు మగబిడ్డ పుట్టాడు. ఈ బుడ్డోడు ఇప్పటికే మాలోని అంతులేని ఆనందాన్ని కన్నీళ్లుగా మార్చాడు. తనే మా జీవితాల్లో అత్యంత విలువైన బహుమతిగా అనుకుంటున్నాం. అతని రాకతో ప్రేమ మయంగా, నవ్వుల హరివిల్లుగా మారుతోంది. అతని ప్రయాణం ప్రేమ, ఆరోగ్యం అంతులేని ఆనందంతో నిండి ఉంటుంది. అతను తన తండ్రిలాగే బలం దయగల వ్యక్తిగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఈ బుడ్డోడితో మా కుటుంబ సభ్యుల బంధం మరింత దృఢంగా పెరగాలి. మా హృదయాలు నిండుగా ఉన్నాయి. ప్రపంచంలోకి స్వాగతిస్తున్నాను. ఎప్పటికీ కృతజ్ఞతలు’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం మెహబూబ్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అంతా కంగ్రాట్స్ చెబుతున్నారు.






