టాలీవుడ్ హీరోకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. మా అక్కను చేసుకుంటే నేను ఫ్రీ అంటూ కామెంట్స్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

by I. Sairam |   (  Updated:2025-06-15 03:34:39  IST  )

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో అడవిశేష్(Adavi Sesh) మనందరికీ సుపరిచితమే.

టాలీవుడ్ హీరోకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. మా అక్కను చేసుకుంటే నేను ఫ్రీ అంటూ కామెంట్స్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో అడవిశేష్(Adavi Sesh) మనందరికీ సుపరిచితమే. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. అందుకున్నాడు శేష్. ప్రస్తుతం ‘గూఢచారి 2’(Gudachari-2)తో పాటు ‘డెకాయిట్’(Decoit) సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా అడవి శేష్ ఓ టీవీ షోకు హాజరయ్యాడు. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ డాన్స్ షో(Dhee Dance Show)కు అడవి శేష్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ షోలో ఉన్న బిగ్ బాస్ బ్యూటీ అశ్విని(ashwini) శేష్‌ను చూసి సర్ ప్రైజ్ అయి.. మా అక్కకు మీరంటే చాలా ఇష్టం అని శేష్‌కు చెప్పింది.

మా అక్కకు మీరంటే చాలా ఇష్టం అని అశ్విని చెప్పగానే .. శేష్ కూడా నాకు మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఆ తర్వాత మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి.. మీకు వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌ వస్తుంది అని చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. అక్కను పెళ్లి చేసుకుంటే నేనూ వస్తాను అని అశ్విని చెప్పగానే శేష్ అవాక్ అయ్యాడు. ఎలా వస్తాననేది కూడా చెప్తాననేసరికి ఆది శేష్ మూవీలో కంటే నీ దగ్గరే ఎక్కువ సస్పెన్స్ ఉందిగా అని అంటాడు. అంతటితో ఈ ప్రోమో అయిపోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ ప్రోమోను చూసిన నెటిజన్లు ఇది ఫ్యామిలీ షోలా లేదు.. ఆమె అసలు ఆడపిల్లలా మాట్లాడుతుందా అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story