డ్యాన్స్ చేస్తూ దర్శనమిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫస్ట్ ఈ వేషాలు ఆపి పిల్లల్ని కనమ్మ తల్లి అంటూ నెటిజన్ల కామెంట్స్

by Gugulothu.Kavitha |

బిగ్ బాస్ షో(Bigg Boss Show) ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్నారు.

డ్యాన్స్ చేస్తూ దర్శనమిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫస్ట్ ఈ వేషాలు ఆపి పిల్లల్ని కనమ్మ తల్లి అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ షో(Bigg Boss Show) ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో శివ జ్యోతి(Shiva Jyothi) అలియాస్ సావిత్రి(Savithri) ఒకరు. ఈ చిన్నది కెరీర్ స్టార్టింగ్‌లో న్యూస్ రీడర్‌గా వర్క్ చేసి ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే చాన్స్ కొట్టేసింది. అక్కడ ఎమోషనల్ డ్రామా చేసి అభిమానులను సంపాదించుకున్నది. ఇక బయటకు వచ్చాక సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ పెట్టుకుని అలరిస్తుంది. అలాగే అప్పుడప్పుడు పలు టీవీ షోల్లో పాల్గొని మెప్పిస్తుంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో సావిత్రి డిఫెరెంట్ స్టైల్‌లో ఉన్న డ్రెస్ వేసుకుని హిందీ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. ఇక దీన్ని తన ఇన్‌స్టా(Instagram)లో పోస్ట్ చేసి హార్ట్ సింబల్స్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫస్ట్ ఈ వేషాలు ఆపి పిల్లల్ని కనమ్మ తల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ బ్యూటీ గంగూలి(Gangooli) అనే వ్యక్తిని 10సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకోగా ఇప్పటికీ ఈ జంటకు పిల్లలు లేరు.

Instagram Link

Next Story