- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. బేబీ షవర్ వీడియో వైరల్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
బిగ్ బాస్(Bigg Boss) షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్(Bigg Boss) షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో సోనియా ఆకుల(Sonia Akula) ఒకరు. ఈ చిన్నది హౌస్‌లోకి వెళ్లకముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఈ అమ్మడు గ్రాఫే చేంజ్ అయిపోయింది. హౌస్‌లో ఈ చిన్నది చేసిన హంగామా అంతా ఇంతాకాదు. పెద్దోడు-చిన్నోడు అంటూ నిఖిల్-పృథ్వీతో సోనియా నడిపిన ట్రాక్ ఆడియన్స్‌కి అసలు నచ్చలేదు. దీంతో ఊహించని విధంగా చాలా తక్కువ వారాల్లోనే బయటికి వచ్చేసింది. ఇక బయటికి వచ్చిన తర్వాత తన ప్రియుడు, బిజినెస్‌మ్యాన్ యష్ వీరగోనితో నిశ్చితార్థం.. వెంటనే పెళ్లి కూడా జరిగిపోయింది.
అయితే సోనియా ఆకుల ఈ మధ్యే ఓ గుడ్‌న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. తాను తల్లికాబోతున్న అంటూ భర్త యష్ వీరగోనికి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సోనియా సీమంతం వేడుకగా జరిగింది. భర్త యష్, కుటుంబ సభ్యులతో సంతోషంగా చేసుకున్న ఈ వేడుకకి పలువురు బిగ్‌బాస్, సీరియల్ సెలబ్రెటీలు వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గామారగా.. నెటిజన్లు మొత్తానికి త్వరలోనే బుల్లి యష్ లేదా బుల్లి సోనియా బయటకి రాబోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సేఫ్ డెలివరీ కావాలని కోరుకుంటున్నారు.






